- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో చలిగాలులు తీవ్రం.. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. రానున్న రెండు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. ఆదిలాబాద్, పటాన్‌చెరులో 7.2 డిగ్రీలు, మెదక్‌లో 7.8 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9 డిగ్రీలు, హనుమకొండలో 10.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 11.7 డిగ్రీలు, రామగుండంలో 11.9 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీల వరకు పడిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అదేవిధంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి వంటి ప్రాంతాల్లో చలిగాలులు మరింత తీవ్రంగా ఉంటాయని IMD అంచనా వేసింది. హైదరాబాద్ (Hyderabad)లోనూ కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చలి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి.






