- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: చలికి వణికిపోవడం ఖాయం
రాష్ట్రంలో చలి తీవ్రత అకస్మాత్తుగా పెరిగింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో చలి తీవ్రత అకస్మాత్తుగా పెరిగింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో రాబోయే రెండు, మూడు రోజులు వాతావరణం చల్లగా ఉండి, ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉండడంతో పాటు, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉపరితల గాలులు ఉత్తర, ఈశాన్య దిశల నుండి గంటకు 6 నుండి 8 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉన్నందున చలి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
ఉష్ణోగ్రతల పతనం:
చలి గాలుల ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు అత్యధికంగా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా, ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. నేడు ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే చాలా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చలి ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.






