తెలంగాణకు బిగ్ రిలీఫ్.. నైరుతి రుతుపవనాలకు అనుకూలం

by Kema Shiva Kumar |

తెలంగాణలో నైరుతి రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణకు బిగ్ రిలీఫ్.. నైరుతి రుతుపవనాలకు అనుకూలం
X

దిశ, వెబ్‌డెస్క్: భానుడి తాపంతో అల్లాడుతున్న తెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాకకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రుతుపవనాలు ఇప్పటికే బంగాళాఖాతం వైపు వేగంగా విస్తరించినట్లుగా వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాల కదలికల ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఉత్తర తెలంగాణ‌కు వార్నింగ్..

ఓ వైపు నైరుతి రుతుపవనలాతో వర్ష సూచన ఉన్నప్పటికీ, మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగనుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ (North Telangana) జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వడగాలులు (Heat waves) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆయా జిల్లాల ప్రజలు మధ్యాహ్నం పూట అప్రమత్తంగా ఐఎండీ అధికారులు ఉండాలని సూచించారు.

Next Story