తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు

by Kema Shiva Kumar |

తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీలతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం ఖమ్మం జిల్లా వైరాలో 4 సెం.మీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌లో 4 సెం.మీ, జోగులాంబ గద్వాల జిల్లా ఐజలో 2 సెం.మీ, ఖమ్మం జిల్లా మధిరలో 1 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. రాగల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర పెరగనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది.

Next Story