- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. వాతావరణంలో ఆకస్మిక మార్పులు!
గత రెండు రోజుల నుంచి వాతావరణంలో ఆకస్మిక మార్పులు కనిపిస్తున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: గత రెండు రోజుల నుంచి వాతావరణంలో ఆకస్మిక మార్పులు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత తగ్గుముఖం పట్టనుందని వాతావరణ నిపుణులు తెలిపారు. అయితే.. ఎప్పుడైనా శివరాత్రితో తగ్గుముఖం పట్టే చలి తీవ్రత ఇప్పుడే సాధారణ స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కొన్ని రోజులుగా చలి తీవ్రతతో ప్రజలు బయటకు రావాలంటేనే భయంతో వణికిపోయారు. ఈ క్రమంలో ప్రస్తుతం చలి తీవ్రత తగ్గిపోయింది. ఈ మేరకు వాతావరణ నిపుణులు తాజాగా కీలక విషయాలు వెల్లడించారు.
హైదరాబాద్‌తో పాటు పశ్చిమ తెలంగాణ(Telangana)లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12-14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పగటి పూట ఎండ తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు ఉండవచ్చని.. రాబోయే 10 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని వెల్లడించారు. గత నెల నుంచి చల్లటి ఈదురు గాలులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఉపశమనం కలగనుంది. ఈ తరుణంలో తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశం లేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.
అయితే.. రాత్రి వేళల్లో చలి తీవ్రత కొంత ఉన్నప్పటికీ, పగటి పూట మాత్రం వేడి వాతావరణం కొనసాగనుంది. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పగటిపూట పొడి వాతావరణం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల మధ్యాహ్న సమయంలో ఎండ ప్రభావం కొంత అధికంగా అనిపించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. రాగల రెండు రోజుల్లో ఉత్తర, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశం ఉందన్నారు.






