ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ‘అలర్ట్ ఫెటీగ్’: వాతావరణ హెచ్చరికలతో విసిగిపోతున్న ప్రజలు

by Kema Shiva Kumar |

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాతావరణ హెచ్చరికల వల్ల ప్రజల్లో ‘అలర్ట్ ఫెటీగ్’ పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ‘అలర్ట్ ఫెటీగ్’: వాతావరణ హెచ్చరికలతో విసిగిపోతున్న ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi), పరిసర ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం ఓ వింతైన సమస్యను ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థల నుంచి మొబైల్ ఫోన్లకు అదే పనిగా వస్తున్న హెచ్చరికలతో ప్రజల్లో అలర్ట్ ఫెటీగ్ (Alert fatigue) పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో నైరుతి రుతుపవనాలు ఎంటరైన నేపథ్యంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులతో వాతావరణ శాఖ ప్రజల మొబైల్ ఫోన్లకు పెద్ద శబ్దంతో కూడిన అత్యవసర సందేశాలను (Emergency Alerts) పంపుతోంది. అయితే, పదే పదే ఇలాంటి రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు రావడం, కొన్నిసార్లు హెచ్చరించినంత తీవ్రతతో వాతావరణం మారకపోవడంతో ప్రజలు లైట్‌గా తీసుకుంటున్నారు. దీంతో భవిష్యత్తులో నిజంగానే ఏదైనా పెద్ద ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

దారుణంగా విజిబిలిటీ..

నార్ట్ ఇండియాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా గంటకు 92 కి.మీ నుంచి గరిష్టంగా 111 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో పాటు భారీ ఆస్తి నష్టం సంభవించింది. భారీగా వీస్తున్న దుమ్ము, తుపానుల (Dust Storms) కారణంగా విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI Airport) పరిసరాల్లో విమానాల రాకపోకలకు, నగరంలో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Next Story