భూ ఆక్రమణల యత్నంతో ఉద్రిక్తత.. రంగంలోకి దిగిన పోలీసులు

by Taduka Kalyani |

ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్రాస్ రోడ్, రాళ్లకుంట చెరువు శివారు ప్రాంత భూముల్లో స్థానికేతర గిరిజనులు ఆక్రమణలకు యత్నించడంతో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భూ ఆక్రమణల యత్నంతో ఉద్రిక్తత.. రంగంలోకి దిగిన పోలీసులు
X

దిశ, ఏటూరునాగారం: ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్రాస్ రోడ్, రాళ్లకుంట చెరువు శివారు ప్రాంత భూముల్లో స్థానికేతర గిరిజనులు ఆక్రమణలకు యత్నించడంతో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక గిరిజనేతర రైతులు, భూ ఆక్రమణకు వచ్చిన స్థానికేతర గిరిజనుల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఎస్సై బొంకురి మహేష్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికేతర గిరిజనులు తాము ఆదివాసీలమని, ఈ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు తమకు ఉందని పోలీసులకు వివరించారు. మరోవైపు, స్థానిక గిరిజనేతర రైతులు తాము తరతరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, భూములపై ఎలాంటి ఆక్రమణలను సహించబోమని స్పష్టం చేశారు. బాహ్య ప్రాంతాల నుంచి వచ్చి గిరిజనులు–గిరిజనేతరుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకుంటామని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ఎస్సై మహేష్, ఖాళీ భూముల్లో గుడిసెలు వేసుకునే హక్కు ఉందని నిరూపించే జీవోలు లేదా అధికారిక పత్రాలు ఉంటే సమర్పించాలని సూచించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆక్రమణలు, ఘర్షణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story