- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
M అంటే మట్టి.. P అంటే పేకాట: మరింత ముదిరిన అన్నదమ్ముల వైర్యం
కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. పచ్చగడ్డి వేయకపోయినా ఇద్దరి మధ్య మాటలయుద్ధం జరుగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: కేశినేని బ్రదర్స్(Kesineni Brothers) మధ్య వివాదం మరింత ముదిరింది. పచ్చగడ్డి వేయకపోయినా ఇద్దరి మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. దీంతో విజయవాడ(Vijayawada)లో అన్నదమ్ముల రాజకీయం రసవత్తరంగా మారింది. విజయవాడను 10 ఏళ్ల పాటు టీడీపీ(Tdp) ఎంపీగా కేశినేని నాని(Kesinani Nani) పాలించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా తమ్ముడు చిన్నికి సీటు దక్కడం గెలవడం జరిగిపోయాయి.
దీంతో అన్నదమ్ములు కాస్త ప్రత్యర్థులుగా మారింది. అప్పటి నుంచి కేశినేని బ్రదర్స్ పరస్పరం చిర్రుబుర్రుమంటున్నారు. ఇప్పుడు ఇది మరింతగా మారి వ్యతిగత విమర్శలకు వరకు వెళ్లింది. ప్రభుత్వంలో ఎంపీ కేశినేని చిన్నిని ప్రతిపక్షంలో మాజీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయంటూ కేశినేని చిన్ని(Kesineni Chinni)పై నాని విమర్శల బాణం ఎక్కుపెట్టారు. అయితే ఇందుకు తమ్ముడు చిన్ని సైతం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ చర్యలకు సైతం సిద్ధమయ్యారు.
అయినా సరే కేశినేని నాని వెనక్కి తగ్గడం లేదు. కేశినేని చిన్ని అనుచరులను టార్గెట్ చేస్తూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న మట్టి అక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు కురిపించారు. ఎంపీలో M అంటే మట్టి అని, P అంటే పేకాట అంటూ చిన్నిపై పోస్టులు పెట్టారు. శిష్యుడి కాల్ లాగ్ చూసి షాక్ తిన్నావా అంటూ చిన్నిపై సెటైర్లు వేశారు.రోబోయే మరిన్ని షాకులు తప్పవంటూ హెచ్చరించారు.






