- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంపు ప్రాంతాల్లో అధికారుల పర్యటన..
by Kodari Anjali |
వరద నీరు నిల్వ కాకుండా చేపట్టాల్సిన చర్యలను మున్సిపల్, హైడ్రా, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు.

X
దిశ, మేడిపల్లి: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ కాకుండా చేపట్టాల్సిన చర్యలను మున్సిపల్, హైడ్రా, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ఈ పర్యటనలో తుంగతుర్తి రవి పాల్గొని గతంలో ముంపుకు గురైన ప్రాంతాలను అధికారులకు చూపించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వరదలకు శాశ్వత పరిష్కారంగా ఎస్ ఎన్ డీ పి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, నీటి ప్రవాహానికి అడ్డంకుల తొలగింపు వంటి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిపి మోహన్ కుమార్, సీఐ శంకరయ్య, ట్రాఫిక్ సిఐ రవీందర్, హైడ్రా అధికారి మోహన్ రావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






