- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్నేళ్ల తర్వాత కలవడం సంతోషంగా ఉంది.. సీఎంతో ఫొటోలు షేర్ చేసిన సిమ్రాన్
ఇన్నేళ్ల తర్వాత సీఎం విజయ్‌ను కలవడం సంతోషంగా ఉందంటూ నటి సిమ్రాన్ ఫొటోలు పంచుకున్నారు.

దిశ, సినిమా: ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాటెండ్ హీరోయిన్స్‌లో ఒకరిగా వెలిగిన సీనియర్ నటి సిమ్రాన్.. ప్రస్తుతం సెకండ్స్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రధాన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అలాగే అప్పట్లో కోలీవుడ్‌లో ఈ నటి దళపతి విజయ్‌తో కలిసి 6 చిత్రాలకు పైననే నటించింది. దీంతో స్క్రీన్‌పై వీళ్లిద్దరి కెమిస్ట్రీకి ప్రత్యేక ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. అలాంటి వీళ్లు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిశారు. ఈ విషయాన్ని సిమ్రాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ.. ‘ఇన్నేళ్ల తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్‌ను నా ఫ్యామిలీతో కలుసుకోవడం ఆనందంగా అనిపించింది. సీఎం విజయ్ ఆప్యాయత, వినయం, నిజాయితీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్రజల ప్రేమని సంపాదించుకున్న ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. తమిళనాడు అభివృద్ధి కోసం విజయ్ దూరదృష్టి, సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఆయన నాయకత్వానికి శుభాకాంక్షలు. విజయ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ ఫొటోలను పంచుకుంది.






