- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ కారణంగా మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ ఈటెల రాజేందర్
ఎంఈ ఎస్ కాలనీలోని మృతుల తల్లిదండ్రులను ఈటల రాజేందర్ పరామర్శించారు.

దిశ, అల్వాల్: ఇటీవల టెలికాం కాలనీలో శనివారం తెల్లవారుజామున విద్యుత్ తీగలు తెగిపడి జరిగిన ఘోర ప్రమాదంలో తండ్రి కూతురు మృతి చెందిన విషయం విదితమే సోమవారం మృతుల కటుంబ సభ్యులను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ఎంఈఎస్ కాలనీలోని వారి నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. భార్య కళ్లముందే భర్త, కుమార్తె ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం అన్నారు. ఆ కుటుంబం మానసిక పరిస్థితి కోలుకోవడానికి చాల సమయం పడుతుందని ఇది ముమ్మాటి విద్యుత్ శాఖ నిర్లక్ష్యం అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ సరఫా ట్రిప్ కావాల్సి ఉన్నప్పటికీ గంటన్నర నుంచి రెండుగంటలవరకు ట్రిప్ కాకపోవడం సంబంధిత శాఖల తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. అంతేకాకుండా అత్యవసర ఫోన్ కాల్స్ వచ్చినప్పటికి అధికారులు స్పందించంక పోవడం ఏమిటని ప్రశ్నంచారు.
ఉద్యోగ అవకాశం కల్పించాలి...
ఈ సంఘటనను ప్రభుత్వం సంబధిత శాఖలు సీరియస్ గా తీసుకుని బాధిత కుటుంబానికి అండగా నిలువాలని కోరారు. మృతుడు సందీప్ కుటుంబానికి ప్రధాన ఆధారం కాగా ఆయన మృతితో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దానికి తోడు మృతుని తల్లి క్యాన్సర్ తో బాధపడుతుండటం కుటుంబ పరిస్థితిని మరింత దయనీయంగా మారింది. ఈ ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మానవత దృక్ఫథంతో వ్యవహరించి మృతులిద్దరికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు మృతుడి భార్య జీవనోపాధి కోసం ప్రభుత్వంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో తగిన ఉద్యోగ అవకాశం కల్పించాలని భారతీయ జనత పార్టీతరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అంతే కాకుండా ఈ సంఘటనకు బాధ్యులైన అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపి నాయకులు పాల్గొన్నారు.






