- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి పోరాడుతా..
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం పోరాటం చేస్తానని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు.

దిశ, మంచిర్యాల: తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం పోరాటం చేస్తానని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లాలో బాయి బాట కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తిలక్ స్టేడియం వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కర్కోటక పాలన సాగుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని పక్కకు పెట్టి ఎమ్మెల్యే హైదరాబాదులో ఉండడం విడ్డూరం అన్నారు. రెండు నెలలకు ఒకసారి నియోజకవర్గానికి వస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా గారడి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎల్లంపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తానని మాట ఇచ్చారు. బెల్లంపల్లిలో చింతలమయమైన రోడ్లను చూసి ధ్వజమెత్తారు. తెలంగాణ రక్షక సేన టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో ముందుకు రావడం జరిగిందన్నారు. ఐదు అంశాలతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు విద్య అందని మిద్దెగానే మారిందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య, వైద్యం, యువకులకు సొంతగా పరిశ్రమల ఏర్పాటు కు రూ.10 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాల మంజూరు, ఉద్యోగాల ఏర్పాటు, రైతులు ఇబ్బంది పడకుండా వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ. జనార్ధన్, హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, రాష్ట్ర నాయకుడు సాజన్, మౌనిక్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.






