- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవాలి..
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య గర్ ముక్త బిజిలి పథకం ద్వారా రూ.60 వేల సబ్సిడీ ని అందిస్తుందని.. విద్యుత్ ఆదా, చార్జీల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేసుకోవాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు.

దిశ, అక్బర్ పేట భూంపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య గర్ ముక్త బిజిలి పథకం ద్వారా రూ.60 వేల సబ్సిడీ ని అందిస్తుందని.. విద్యుత్ ఆదా, చార్జీల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేసుకోవాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే లో రూ.50 లక్షల వ్యయం తో చేపట్టనున్న మహిళా సమాఖ్య భవనం, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం, అసంపూర్తిగా నిలిచిన పలు కుల సంఘాల భవనాల పనులకు గ్రామ సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న సంకల్పంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తుందని చెప్పారు. మోతే ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని, మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే మోతె కు మరిన్ని నిధులను మంజూరు చేయిస్తానని, గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రశాంత్, వార్డు సభ్యులు, బిజెపి మండలాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జిల్లా నాయకులు బిక్షపతి, నవీన్ పలువురు పాల్గొన్నారు.






