మెదక్ పట్టణ రూపురేఖలు మార్చే దిశగా కృషి

by Taduka Kalyani |

మెదక్ పట్టణ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.

మెదక్ పట్టణ రూపురేఖలు మార్చే దిశగా కృషి
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ పట్టణ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో రూ.2 కోట్ల 70 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. మెదక్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి ఫలాలు ప్రతి వార్డుకు, ప్రతి కుటుంబానికి చేరేలా నిరంతరం పని చేస్తున్నామని తెలిపారు. అనంతరం 27వ వార్డులో రూ.35 లక్షల వ్యయంతో వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. 11వ వార్డులోని సాయి నగర్ కాలనీ, వెంకట్రావు నగర్ కాలనీ, రషీద్ కాలనీలలో రూ.52 లక్షల వ్యయంతో సీసీ డ్రెయిన్లు, స్లాబులు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ నరేశ్ గౌడ్, అధికారులు, కౌన్సిలర్ లు పాల్గొన్నారు.

Next Story