- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Satya Nadella: ఏఐ లాభాలు కొద్దిమందికే పరిమితం కాకూడదు
ఏఐ వల్ల పరిశ్రమల పరిజ్ఞానం, నైపుణ్యం, ఆర్థిక విలువ మొత్తం కొన్ని శక్తివంతమైన మోడళ్ల చేతుల్లోకి వెళ్లిపోతే, వ్యాపారాలు తమ పోటీతత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ వ్యాపారాల పనితీరును ఏఐ వేగంగా మార్చేస్తున్నప్పటికీ, దాని లాభాలు కొద్దిమంది టెక్నాలజీ దిగ్గజాలకే పరిమితం కాకూడదని సత్య నాదెళ్ల అన్నారు. ఏఐ వల్ల పరిశ్రమల పరిజ్ఞానం, నైపుణ్యం, ఆర్థిక విలువ మొత్తం కొన్ని శక్తివంతమైన మోడళ్ల చేతుల్లోకి వెళ్లిపోతే, వ్యాపారాలు తమ పోటీతత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. దానివల్ల చాలా రంగాలు తమ నైపుణ్యాన్ని, దీర్ఘకాలిక పోటీతత్వాన్ని కోల్పోయి సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉద్యోగుల జ్ఞానం, సృజనాత్మకత, నిర్ణయం తీసుకునే సామర్థ్యంతో పాటు సంస్థలు తమ సొంత ఏఐ సామర్థ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఏఐని మానవులకు ప్రత్యామ్నాయంగా కాకుండా, మానవ సామర్థ్యాలను మరింత పెంచే సాధనంగా చూడాలని నాదెళ్ల అభిప్రాయపడ్డారు.
ఏఐ భవిష్యత్తుపై టెక్ ప్రపంచంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో సత్య నాదెళ్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ ఏఐ వల్ల దీర్ఘకాలిక ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తుండగా, నాదెళ్ల మాత్రం ప్రధాన సమస్య ఉద్యోగాల కంటే ఆర్థిక విలువ పంపిణీ అని వాదిస్తున్నారు. ఏఐ శక్తి కొద్దిమంది ప్రొవైడర్ల వద్ద కేంద్రీకృతం కాకుండా, వివిధ పరిశ్రమలు, దేశాలు, సంస్థలు తమ సొంత ఏఐ సామర్థ్యాలను పెంచుకునేలా ‘ఫ్రాంటియర్ ఎకోసిస్టమ్’ నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.






