- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలా ఎన్నడూ లేదు: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సీనియర్ నేతల కృషితో రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.3,820 కోట్లు మంజూరు చేసినట్లు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తెలిపారు...

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సీనియర్ నేతల కృషితో రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.3,820 కోట్లు మంజూరు చేసినట్లు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తెలిపారు. గ్రామీణ అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం నిధులను విడుదల చేసింది. సోమవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఇవ్వాల్సిన 40 శాతం వాటా నిధులను ఇప్పటికీ విడుదల చేయలేదు. సుమారు రూ.2,200 కోట్ల మేర మ్యాచింగ్ ఫండ్స్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేస్తే రూ.6,370 కోట్లకు పైగా గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాలకు వినియోగించే అవకాశం ఉంటుంది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీల వద్ద అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడం వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ వాటా నిధులను సమకూరుస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.’’ అని మండిపడ్డారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలను విమర్శించడం మానేసి, వెంటనే రాష్ట్ర వాటా మ్యాచింగ్ ఫండ్స్ విడుదల చేయాలి. తెలంగాణ గ్రామాలు నష్టపోకుండా, గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంతో పాటు జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన, వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, అమృత్ సరోవర్ కార్యక్రమం, కాంపా నిధులు వంటి అనేక పథకాల కింద భారీగా నిధులు అందిస్తోంది. లక్షల కోట్ల రూపాయలతో చేపట్టే భారీ ప్రాజెక్టులు ఎంత ఫలితాన్ని ఇస్తాయో, గ్రామీణ స్థాయిలో అమలయ్యే ఈ చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతే స్థాయిలో ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగిస్తాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే తన వాటా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం ఆందోళన తప్పదు.’’ అని మాజీ ఎంపీ బూర నర్సయ్య హెచ్చరించారు.






