మాతృ మరణాలపై డీఎంహెచ్ఓ సీరియస్

by Taduka Kalyani |

జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. లలితా దేవి అధ్యక్షతన జిల్లా స్థాయి మాతృ మరణాల సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు.

మాతృ మరణాలపై డీఎంహెచ్ఓ సీరియస్
X

దిశ, సంగారెడ్డి అర్బన్: జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. లలితా దేవి అధ్యక్షతన జిల్లా స్థాయి మాతృ మరణాల సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. హత్నూర, దౌల్తాబాద్, కరసుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నమోదైన మాతృ మరణాల కేసులను సమగ్రంగా సమీక్షించారు. మరణాలకు గల కారణాలు, గర్భిణీలకు అందించిన సేవలు, రిఫరల్ వ్యవస్థ లోపాలపై చర్చించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం.సి.హెచ్. డా. కె. నాగ నిర్మల మాట్లాడుతూ.. అధిక ప్రమాద గర్భిణీలను ముందుగానే గుర్తించి, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించి, సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. డీఎంహెచ్ఓ డా. లలితా దేవి మాట్లాడుతూ.. అధిక ప్రమాద గర్భిణీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచి, రిఫరల్ వ్యవస్థను పటిష్టం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డా. శశాంక్, పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story