డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల విస్తృత తనిఖీలు..

by Kodari Anjali |

మధురానగర్ గ్రామంలో సోమవారం గంగాధర ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా విస్తృత తనిఖీలు చేపట్టారు.

డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల విస్తృత తనిఖీలు..
X

దిశ, గంగాధర: మండల పరిధిలోని మధురానగర్ గ్రామంలో సోమవారం గంగాధర ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ నుండి వచ్చిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందంతో కలిసి గ్రామంలోని పాన్ షాపులు, వైన్స్ పర్మిట్ రూమ్‌లు, పాఠశాల పరిసరాలు, ఇతర అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వంటి నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా డాగ్ స్క్వాడ్ సహాయంతో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ.. సమాజానికి శాపంగా మారిన మాదక ద్రవ్యాల నిర్మూలనకు, శాంతిభద్రతల పరిరక్షణకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. భవిష్యత్తులోనూ మండల వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఎస్సై హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ సిబ్బంది, క్లూస్ టీమ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story