DRDO మరో సంచలన విజయం.. లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ టెస్ట్ సక్సెస్

by Kema Shiva Kumar |

భారత రక్షణ వ్యవస్థలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది.

DRDO మరో సంచలన విజయం.. లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ టెస్ట్ సక్సెస్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM) ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. తాజా ప్రయోగంతో క్షిపణి అనుకున్న అన్ని టార్గెట్లను సులభంగా చేరుకుందని రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ నుంచి సుదూర ప్రాంతాల వరకు ఖచ్చితత్వంతో దాడి చేయగలమని లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ నిరూపించింది. క్షిపణిలోని అన్ని విడిభాగాలను, వ్యవస్థలను DRDO అభివృద్ధి చేసింది. రక్షణ రంగంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపాలనే ‘ఆత్మనిర్భర భారత్’ లక్ష్యానికి ఈ విక్టరీ బిగ్ బూస్ట్‌ను ఇచ్చింది.

Next Story