Don't miss it: రేపు అద్భుతం జరుగబోతోంది!

by Gantepaka Srikanth |

ఆకాశంలో చాలా అరుదుగా అద్భుతాలు జరుగుతుంటాయి. రేపు(సోమవారం), ఎల్లుండి(మంగళవారం) అలాంటి అద్భుతమే జరుగబోతోంది.

Dont miss it: రేపు అద్భుతం జరుగబోతోంది!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆకాశంలో చాలా అరుదుగా అద్భుతాలు జరుగుతుంటాయి. రేపు(సోమవారం), ఎల్లుండి(మంగళవారం) అలాంటి అద్భుతమే జరుగబోతోంది. సూపర్‌ మూన్‌ కనువిందు చేయనున్నది. భూమి చుట్టూ తిరుగుతూ కొన్ని సార్లు చంద్రుడు దగ్గరకు రాబోతోంది. పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే అధికంగా మూన్‌ సైజు, వెలుగు ఉండనున్నాయి. 14 శాతం సైజు, 30 శాతం వెలుగుతో అధికంగా చంద్రుడు కనిపించనున్నాడు. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో మరో రెండు సూపర్‌ మూన్‌ ఉండనున్నాయి. భూమి నీడ చంద్రుడిపై పడటాన్నే చంద్ర గ్రహణంగా పిలుస్తారనే విషయం తెలిసిందే. అయితే.. చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే కాస్త పెద్దగా దర్శనం ఇవ్వనున్నాడు. దీన్నే సూపర్‌ మూన్‌గా పిలుస్తుంటారు. ఈ సూపర్‌ మూన్‌ను హార్వెస్ట్‌ మూన్‌గా పిలుస్తూ ఉంటారు.

Next Story