ధరణి సర్వేను చేయలేము

by  |
ధరణి సర్వేను చేయలేము
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్:
జీతాలు వచ్చే వరకు తమకు సర్వేలు అప్పచెప్పవద్దనీ..తాము కొత్తగా ధరణి సర్వేను చేయలేమని మెప్మాలో పనిచేసే రిసోర్స్ పర్సన్స్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆర్‌పీలు శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు అరుణోదయ రిసోర్స్ పర్సన్స్ సొసైటి అధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. తమ బాధలను మున్సిపల్ కమిషనర్ అర్థం చేసుకోవాలన్నారు. లాక్ డౌన్ నుంచి రెస్టు లేకుండా తాము పనిచేస్తున్నామని తెలిపారు. తమకు 14 నెలల వేతనం రావాలని చెప్పారు. కాని దాని గురించి ఆలోచించకుండా తమకు అప్పజెప్పిన ప్రతి డ్యూటీనీ చేశామని తెలిపారు. ఇకపై జీతాలు వచ్చేవరకు తమకు సర్వేలు అప్పజెప్పవద్దనీ, తాము కొత్తగా ధరణి సర్వేను చేయ్యలేమని తెలిపారు. తాము ఎస్ సీఎఫ్ లకు సంబంధించిన పనులను చేస్తామని తెలిపారు. ఇకపై జీతాలు రాకుండా ఎలాంటి సర్వేలు చేయబోమని తెలిపారు.


Next Story

Most Viewed