కొత్త బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు

6

దిశ, ముషీరాబాద్: త్వరలోనే ముసారాం బాగ్ కొత్త బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన చర్యలను తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌లతో కలిసి అలీకేఫ్ చౌరస్తా నుంచి ముసారాంబాగ్ బ్రిడ్జి వద్దకు చేరుకొని మూసీ వరద ఉధృతిని ఆయన పరిశీలించారు. బ్రిడ్జికి ఇరువైపులా తాత్కాలిక బారీకేడ్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆయన సూచించారు.