- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చేది జనసేన ప్రభుత్వమే.. రాయలసీమ లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తాం
<p>దిశ, డైనమిక్ బ్యూరో : రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వైకాపా పాలన బాగుంటే రోడ్లమీదకు వచ్చేవాళ్లం కాదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులందరికీ పింఛన్లు అందడం లేదని, కొందరి వల్ల రెడ్డి సామాజికవర్గంలోని అందరికీ చెడ్డ పేరు వస్తోందని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి కోసం సీఎం క్యాంపు […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వైకాపా పాలన బాగుంటే రోడ్లమీదకు వచ్చేవాళ్లం కాదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు బహిరంగ సభలో పవన్ మాట్లాడారు.
రాష్ట్రంలో అర్హులందరికీ పింఛన్లు అందడం లేదని, కొందరి వల్ల రెడ్డి సామాజికవర్గంలోని అందరికీ చెడ్డ పేరు వస్తోందని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి కోసం సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. కులాలు, మతాలకు అతీతంగా అండగా ఉంటామని పేర్కొన్నారు. రాయలసీమ నుంచి ఎందరో యువత వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి ఎందరో సీఎంల వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదని మండిపడ్డారు.
Next Story






