- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోమలికి డబ్బులు, క్రెడిట్స్ ఇస్తాం : శేఖర్ కమ్ముల
<p>దిశ, వెబ్‌డెస్క్ : మరుగున పడిన ‘సారంగదరియా’ జానపద గీతాన్ని వెలుగులోకి తెచ్చిన కోమలికి ‘లవ్ స్టోరీ’ సినిమాలో క్రెడిట్ ఇస్తామని ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించారు. క్రెడిట్ తోపాటు డబ్బులు కూడా ఇస్తామన్నారు. సినిమా ఆడియో ఫంక్షన్‌లో కోమలితో ‘సారంగదరియా’ పాటను పాడిస్తామని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. సినిమా పనుల్లో బిజీగా ఉండడం వల్ల ‘సారంగదరియా’ పాటపై జరుగుతున్న వివాదాన్ని తను ఫాలో కాలేదని పేర్కొన్నారు. తాను ఆ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : మరుగున పడిన ‘సారంగదరియా’ జానపద గీతాన్ని వెలుగులోకి తెచ్చిన కోమలికి ‘లవ్ స్టోరీ’ సినిమాలో క్రెడిట్ ఇస్తామని ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించారు. క్రెడిట్ తోపాటు డబ్బులు కూడా ఇస్తామన్నారు. సినిమా ఆడియో ఫంక్షన్‌లో కోమలితో ‘సారంగదరియా’ పాటను పాడిస్తామని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. సినిమా పనుల్లో బిజీగా ఉండడం వల్ల ‘సారంగదరియా’ పాటపై జరుగుతున్న వివాదాన్ని తను ఫాలో కాలేదని పేర్కొన్నారు.
తాను ఆ పాటను సినిమాలో పెట్టాలనుకున్నప్పుడే ఆమెను సుద్దాల అశోక్ తేజ, నేను సంప్రదించామని వివరించారు. పాట పాడాలని మొదట ఆమెనే కోరామని, కానీ జలుబు కారణంగా తాను పాడలేనని చెప్పడంతోనే మంగ్లీతో పాడించామని తెలిపారు. గతంలోనే తన సినిమాల్లో వాడిన జానపద గేయాలకు వాటి హక్కుదారులకు డబ్బులు ఇవ్వడంతోపాటు క్రెడిట్స్ కూడా ఇచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం కోమలికి కూడా అదే విధంగా ఇస్తామని చెప్పారు. ఆడియో ఫంక్షన్ డేట్ ఫిక్స్ కాగానే కోమలిని ఆహ్వానించి ‘సారంగదరియా’ పాటను ఆలపించాలని కోరుతామని వివరించారు.






