ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి- బేడ బుడగ జంగం

by Shyam |

<p>దిశ, ఖైరతాబాద్ : ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తీవ్ర వెనుకబాటును అనుభవిస్తున్న బేడ బుడగ జంగాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ బేడ బుడగ జంగం ఐక్య వేదిక సీఎంను డిమాండ్ చేసింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చైర్మన్ తూర్పాటి జగదీశ్వర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. స్థిర నివాసం సైతం లేకుండా జీవనం సాగిస్తున్న తమలాంటి వర్గాలను పట్టించుకోకుండా ఇప్పటికే [&hellip;]</p>

beda
X

దిశ, ఖైరతాబాద్ : ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తీవ్ర వెనుకబాటును అనుభవిస్తున్న బేడ బుడగ జంగాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ బేడ బుడగ జంగం ఐక్య వేదిక సీఎంను డిమాండ్ చేసింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చైర్మన్ తూర్పాటి జగదీశ్వర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

స్థిర నివాసం సైతం లేకుండా జీవనం సాగిస్తున్న తమలాంటి వర్గాలను పట్టించుకోకుండా ఇప్పటికే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వర్గాలకే న్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే మాల, మాదిగల అనంతరం ఎస్సీ జాబితాలో అధిక జనాభా కలిగిన తమ వర్గాలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. బుడగ జంగాల అభివృద్ధికి 10 వేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా పాండు, సాయన్న. కోశాధికారిగా వెంకటేష్, సలహాదారులుగా చింతల యాదగిరి, తూర్పాటి హనుమంతు, హస్తం యాదగిరిలను నియమించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story