అలా అనుకోవడం మూర్ఖత్వం : పవన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, అమరావతి బ్యూరో: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను వృధా కానివ్వమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం అయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. బీజేపీతో కలసి రైతుల పక్షాన నిలబడతామన్నారు. రాజధానిని మార్చుకుంటామని ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సరైంది కాదన్నారు. మూడు రాజధానులు చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనుకోవడం మూర్ఖత్వమేనని విమర్శించారు. 200 రోజులుగా [&hellip;]</p>

అలా అనుకోవడం మూర్ఖత్వం : పవన్
X

దిశ, అమరావతి బ్యూరో: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను వృధా కానివ్వమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం అయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. బీజేపీతో కలసి రైతుల పక్షాన నిలబడతామన్నారు. రాజధానిని మార్చుకుంటామని ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సరైంది కాదన్నారు. మూడు రాజధానులు చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనుకోవడం మూర్ఖత్వమేనని విమర్శించారు. 200 రోజులుగా రైతులు పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. తమ పార్టీ మొదటనుంచి అమరావతికి మద్దతు తెలుపుతోందని స్పష్టం చేశారు.

Next Story