అనాధల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలి

by Shyam |

<p>దిశ, అంబర్ పేట్: అనాధల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు  అభిప్రాయపడ్డారు. ఫోర్స్ ఆధ్వర్యంలో అనాధలకు ప్రత్యేక చట్టం కావాలని డిమాండ్ చేస్తూ.. మా ఇల్లు, బాల వికాస, ఎంవీ ఫౌండేషన్, డాన్ బాస్కో, నవ జీవన్, అనాధ హక్కుల కార్యకర్తలు, ఎన్జీఓ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లి లోని ప్యాప్సిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సామాజిక కార్యకర్త, మా ఇల్లు ఆశ్రమ [&hellip;]</p>

orphan
X

దిశ, అంబర్ పేట్: అనాధల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఫోర్స్ ఆధ్వర్యంలో అనాధలకు ప్రత్యేక చట్టం కావాలని డిమాండ్ చేస్తూ.. మా ఇల్లు, బాల వికాస, ఎంవీ ఫౌండేషన్, డాన్ బాస్కో, నవ జీవన్, అనాధ హక్కుల కార్యకర్తలు, ఎన్జీఓ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లి లోని ప్యాప్సిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సామాజిక కార్యకర్త, మా ఇల్లు ఆశ్రమ వ్యవస్థాపకులు గాదె ఇన్నయ్య హజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్దెనిమిదేళ్ల పిల్లల కోసం ఉన్న జువైనల్ యాక్ట్ అనాధలకు పూర్తి న్యాయం చెయ్యలేదని చెప్పారు. వారి కోసం ప్రత్యేక చట్టం రావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అనాధలు ఆత్మ గౌరవంతో బతికేలా వారికి చట్టబద్దమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోని భద్రత కల్పించాలని కోరారు. అనాధ అనే పదం చాలా దయనీయంగా ఉందని, వారికి ఆత్మ గౌరవంతో బతికేలా ఒక నిర్వచనం ఇవ్వాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనాధల స్థితిగతులపై కేబినెట్ సబ్ కమిటీ వేయటం హర్షణీయమని అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరే అనాధల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అనాధలకు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రిటైర్డ్ జడ్జి ప్రసాద రాజు, బాల వికాస ప్రతినిధి శివారెడ్డి, డాన్ బాస్కో నవజీవన్ ప్రతినిధి ఫాదర్ కౌశి, సామాజిక కార్యకర్త స్నేహ, అనిత రెడ్డి పాల్గొన్నారు.

Next Story