- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేము
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి అన్నారు. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఆవరణలో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల ఫ్లాగ్ డే దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రాణాలకు తెగించి ఎన్నో త్యాగాలు చేస్తూ పోలీసులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. శాంతిభద్రతల విషయంలో 24 గంటలు విధులు నిర్వహిస్తూ వారి జీవితాలను ప్రజలకు అంకితం చేస్తున్నారని […]</p>

X
దిశ, సిద్దిపేట:
పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి అన్నారు. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఆవరణలో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల ఫ్లాగ్ డే దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రాణాలకు తెగించి ఎన్నో త్యాగాలు చేస్తూ పోలీసులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. శాంతిభద్రతల విషయంలో 24 గంటలు విధులు నిర్వహిస్తూ వారి జీవితాలను ప్రజలకు అంకితం చేస్తున్నారని ఆయన చెప్పారు. అనంతరం పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ…. పోలీసులు త్యాగం చేయని రోజు అంటూ ఉండదని అన్నారు.
Next Story






