‘పెగాసెస్ ప్రాజెక్టు రిపోర్టుకు కట్టుబడే ఉన్నాం’

by  |
Pegasus-Malware
X

న్యూఢిల్లీ: పెగాసెస్ ప్రాజెక్టు రిపోర్టులో వెల్లడించిన విషయాలకు తాము కట్టుబడే ఉన్నామని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ గురువారం వెల్లడించింది. పెగాసెస్ ప్రాజెక్టుకు సంబంధించి పలు మీడియాల్లో వస్తున్న అసంబద్దమైన కథనాలు, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ఆరోపణలపై స్పందింస్తూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ మేరకు ప్రకటన చేసింది. ‘పెగాసెస్‌ ప్రాజెక్టులో వెల్లడించిన విషయాలకు కట్టుబడి ఉన్నాము. ఆ డాటా ఎన్ఎస్ఓ గ్రూపు అభివృద్ధి చేసిన పెగాసెస్ స్పై వేర్ కు చెందిన టార్గెట్ జాబితాకు చెందినది అనే అంశాన్ని ఖండించలేమని’ అని ఆమ్నెస్టీ పేర్కొంది. జర్నలిస్టులు, రాజకీయ నేతలు, ప్రముఖ వ్యక్తులను అన్యాయ పూరితంగా పెగాసెస్ స్పైవేర్ ద్వారా టార్గెట్ చేస్తున్నారన్న వార్తల నుంచి దృష్టి మరల్చే ఉద్దేశంతోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆమ్నెస్టీ పేర్కొంది.

కాగా పెగాసెస్ వివాదంలో ఆమ్నెస్టీ పాత్ర నేపథ్యంలో ఆ సంస్థను నిషేదించాలని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఇటీవల డిమాండ్ చేశారు. ‘ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఆమ్నెస్టీ భాగస్వామి. ఇందులో ఆమ్నెస్టీ పాత్ర ఏంటో అందరికీ తెలుసు. ఆ సంస్థ దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. భారత్‌ను అప్రతిష్ట పాలు చేయడానికి ఆమ్నెస్టీ రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. ఇదంతా ప్రధాని మోడీ పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగించేందుకు ప్రణాళిక బద్దంగా రూపొందించిన అంతర్జాతీయ కుట్ర. ఆమ్నెస్టీ వాదనలో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఆ జాబితాలో పేర్కొన్న ఎవరి ఫోన్ సెట్లపైనా ఇప్పటి వరకు ఫోర్సెనిక్ పరీక్షలు చేసినట్టు లేదని’ అని హిమంత బిశ్వశర్మ తెలిపారు. కాగా తాము ఇన్ఫెక్ట్ అయిన ఫోన్లపై టెక్నికల్, ఫోరెన్సిక్ ఎనాలసిస్ చేశామని ఆమ్నెస్టీ చెబుతోంది. అందులో జీరో క్లిక్ ఆపరేషన్‌తో పెగాసెస్ ఇన్ ఫెక్టెడ్‌కు డివైజెస్ గురైనట్టు తాము గమనించామని ఆమ్నెస్టీ పేర్కొంది.


Next Story