టాలెంట్‌ని వెలికితీస్తాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
SRILANKA
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగిడి సాంస్కృతిక సంస్థ, తెలంగాణ పర్యాటక, భాషా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక సాంస్కృతిక శాఖ కు చెందిన కళాకారులు క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సింగిడి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విశ్వకర్మ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం అక్టోబర్ 18 నుంచి 23 వరకు ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన వరల్డ్ కిక్ బాక్సింగ్ చాంపియన్స్ షిప్ లో సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు లహరి, గిరీష్, ఆశిష్ చంద్ అవార్డులు సాధించడం సంతోషంగా ఉందని శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మించి, క్రీడాకారులను తయారు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి గౌడ్, కిక్ బాక్సింగ్ కోచ్ లు అరుణ్ సింగ్, అవినాష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed