- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలుగు పారుతున్న ‘డివైడర్’.. ఎక్కడంటే..!
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు, వాగులు ఉప్పొంగి అలుగు పారడం అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఫస్ట్ టైం జాతీయ రహదారి డివైడర్ పై నుంచి అలుగు పారుతోంది. ఈ దృశ్యం నిర్మల్ పట్టణంలోని నిర్మల్ టు ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో గల జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బ్రహ్మం గారి మఠం వద్ద భారీగా వరద నీరు నిలవడంతో డివైడరు పై నుంచి అలుగు పారుతున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. […]</p>

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు, వాగులు ఉప్పొంగి అలుగు పారడం అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఫస్ట్ టైం జాతీయ రహదారి డివైడర్ పై నుంచి అలుగు పారుతోంది. ఈ దృశ్యం నిర్మల్ పట్టణంలోని నిర్మల్ టు ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో గల జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బ్రహ్మం గారి మఠం వద్ద భారీగా వరద నీరు నిలవడంతో డివైడరు పై నుంచి అలుగు పారుతున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
అయితే, ఎగువన బంగల్ పేట చెరువు, జెనిగల కుంటలు ఉండగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇవి పూర్తిగా నిండిపోయాయి. దీంతో అలుగు, తూముల నుంచి నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు నిర్మల్ రూరల్ మండలంలోని డ్యాంగాపూర్, అనంతపేట్ చెరువులు నిండటంతో అలుగులకు గండికొట్టారు. దీంతో ఆ వరద నీరంతా రోడ్లపైకి వచ్చి చేరుతోంది. బంగల్పేట్ చెరువు నిండి ఆ నీరంతా జాతీయ రహదారిపైకి వస్తుండటంతో ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ ఏరియా పూర్తిగా నీట మునిగింది. ప్రస్తుతం నిర్మల్ టు ఆదిలాబాద్ రహదారి ఓ వైపు పూర్తిగా నీటితో నిండిపోగా.. డివైడర్ పై నుంచి అలుగు పారే దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






