జిమ్‌లో డ్యాన్స్ చేసిన బాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్

by  |
జిమ్‌లో డ్యాన్స్ చేసిన బాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్‌లో సూపర్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హృతిక్‌ రోషన్‌.. ఎప్పుడు సోషల్‌ మీడియా వేదికల్లో తన ఆనంద క్షణాలని అభిమానులతో పంచుకుంటూనే ఉంటాడు. ఈ మేరకు తాజాగా జిమ్‌లో డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి షేర్‌ చేశాడు. 1979లో మిస్టర్‌ నట్వర్‌లాల్‌ సినిమాలోని ‘పరదేశీయా’ అనే పాటకు గుజరాతీ గర్బా డ్యాన్స్‌తో ఆకట్టుకోగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంది. ఇక చివరగా నవరాత్రి పండుగ సందర్భంగానే ఈ స్పెషల్ ఈ డ్యాన్స్‌ అంటూ చెప్పుకొచ్చాడు హృతిక్. ఈ క్రమంలోనే హృతిక్‌‌తో ప్రస్తుతం ‘ఫైటర్’మూవీ చేస్తున్న బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే స్పందిస్తూ.. ‘హృతిక్ మంచి హస్యగాడు’ అంటూ ట్వీట్‌ చేసింది. అలాగే రణవీర్ సింగ్, ప్రీతి జింటా, ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్ వరుణ్ ధావన్ ప్రశంసిస్తూ ట్వీట్‌లు చేయడం విశేషం. ఇక ఈ సూపర్ హీరో హృతిక్‌ సినిమా సెట్‌ లేదా జిమ్‌లో ఎక్కువ సేపు సరదాగా గడపడానికే ఇష్టపడతాడని తెలిసిన విషయమే.

Next Story

Most Viewed