అనుష్కను పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరో.. కన్నీళ్లు పెట్టుకున్న నటి

776

దిశ, సినిమా: నటుడు ఆదిత్యా సీల్‌, అతడి ప్రేయసి అనుష్క రంజన్ వివాహం బాలీవుడ్ సెలబ్రిటీల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ఫ్యాన్స్‌తో పంచుకోగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పెళ్లి గిఫ్ట్‌గా ఆదిత్యా సీల్.. అనుష్క కోసం ఒక ప్రత్యేక పాటను అంకితం చేశాడు. దీంతో భావోద్వేగానికి లోనైన రంజన్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘మీ గొంతు వినగానే నా హృదయం ఉప్పొంగింది.

ఈ బ్యూటీఫుల్ మూమెంట్‌లో నన్ను సర్ ప్రైజ్ చేసినందుకు ధన్యవాదాలు. మీరే నా జీవితం, నా ప్రపంచం, అంతకు మించి. ఈ రోజును జీవితాంతం గొప్ప జ్ఞాపకంగా గుర్తుంచుకుంటా’ అని రాసుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘గుడ్ లక్, ఆల్ ది బెస్ట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అనుష్క- ఆదిత్య 4 సంవత్సరాల నుంచి డేటింగ్‌లో ఉండగా.. ఏక్తా కపూర్ వెబ్ సిరీస్ ‘ఫిట్రాట్’లో కలిసి నటించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..