Telegram :టెలిగ్రామ్‌తో జాగ్రత్త.. లేకుంటే అంతే సంగతులు..!

by  |
Telegram :టెలిగ్రామ్‌తో జాగ్రత్త.. లేకుంటే అంతే సంగతులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: మీరు టెలిగ్రామ్ యాప్ ఉపయోగిస్తున్నారా.. అయితే, బీ కేర్ ఫుల్. జాగ్రత్త వహించకపోతే సైబర్ నేరగాళ్లు నట్టేట ముంచేస్తారు. ఇప్పటికే ఫేస్ బుక్‌ అకౌంట్లను హ్యాక్ చేస్తోన్న క్రిమినల్స్.. డబ్బులు కావాలంటూ మేసేజ్‌లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వాట్సాప్‌ల్లో కూడా ఫేక్ లింక్‌లను క్రియేట్ చేసి ఆయా గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. వీటిని గుడ్డిగా నమ్మి క్లిక్ చేసిన బాధితుల పర్సనల్, బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరించి దోపిడీ చేస్తున్నారు. తాజాగా టెలీగ్రామ్‌లో కూడా ఇటువంటి మోసాలు అధికమయ్యాయని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

టెలిగ్రామ్‌లో పెద్ద సమస్య ఇదే..

సాధారణంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపులో చాలా వరకు మొబైల్ నెంబర్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ యాడ్ అవుతుంటారు. కానీ, వేల సంఖ్యలో సభ్యులకు అవకాశం ఇచ్చిన టెలిగ్రామ్‌లో ఫోన్‌ నెంబర్, మ్యూచువల్ ఫ్రెండ్ రిఫరెన్స్ లేకుండానే అపరిచుతులు యాడ్ అవుతున్నారు. ఒకే గ్రూపులో ఏకంగా రెండు లక్షల మంది సభ్యులు.. ప్రాంతాలకు, దేశాలకు సంబంధం లేకుండా గ్రూప్‌ను క్రియేట్ చేసే చాన్స్ ఉండడంతో.. ఇదే అదునుగా తీసుకున్న సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఆయా గ్రూపుల్లో యాడ్ అవుతూ.. ఫేక్ లింకులను క్రియేట్ చేసి.. పర్సనల్ డేటాను హ్యాక్ చేస్తున్నారు. ఇదే క్రమంలో పర్సనల్ డేటాతో బ్లాక్ మెయిలింగ్, అకౌంట్‌లో నగదును విత్ డ్రా చేసే ప్రమాదం కూడా ఉందని.. ఇటువంటి అపరిచిత వ్యక్తులు పంపే లింకులతో జాగ్రత్త వహించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Next Story

Most Viewed