ఫీజుల కోసం ఒత్తిడి చేస్తే చర్యలు… ఇంజనీరింగ్ కళాశాలలకు హెచ్చరిక

by  |
ఫీజుల కోసం ఒత్తిడి చేస్తే చర్యలు… ఇంజనీరింగ్ కళాశాలలకు హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ట్యూషన్ ఫీజుల కోసం విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తే కఠిన చర్యలు చేపడతామని ఇంజినీరింగ్ కళాశాలను తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ హెచ్చరించింది. కరోనా పరిస్థితులలో ఫీజు మొత్తం ఒకేసారి చెల్లించాలని విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఏఐసిటీఈ నిబంధనల ప్రకారం విడతల వారిగా ఫీజు చెల్లించే అవకాశముందని తెలిపారు.

ప్రిన్స్ టన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కళాశాలల్లో ఫీజుల కోసం ఒత్తిడి చేయడం వల్లనే బీటెక్ రెండవ సంవత్సరం విద్యార్థి లావణ్య ఆత్మహత్య చేసుకున్నట్టు గా రాష్ట్ర ఏబివిపి ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు సంబంధిత కళాశాల యాజమాన్యం పై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలలన్ని తప్పనిసరిగా ఏఐసిటీఈ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.



Next Story

Most Viewed