ఏపీకి హెచ్చరిక.. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-08-18 03:49:29  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర, దక్షిణ ద్రోణి ఒడిశా, వాయవ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు వరకు విస్తరించింది. వీటిప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తీరప్రాంతంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరకోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ [&hellip;]</p>

ఏపీకి హెచ్చరిక..  రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు
X

దిశ, ఏపీ బ్యూరో: దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర, దక్షిణ ద్రోణి ఒడిశా, వాయవ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు వరకు విస్తరించింది. వీటిప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తీరప్రాంతంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరకోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటీ, రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Next Story