చంపేస్తాం.. లేపేస్తాం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వార్నింగ్

143

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చంపేస్తాం.. లేపేస్తాం.. బాంబ్ పెడతామంటూ కొంతమంది అగంతకులు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డికి రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాల్స్ వివరాలను డీజీపీకి అందించారు. ఇండియా నెంబర్ల నుంచే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, గతంలో కూడా పాకిస్తాన్, దుబాయ్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు డీజీపీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు.

తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పినా.. డీజీపీ ఇవ్వడం లేదని రాజాసింగ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న తనకు గన్ లైసెన్స్ ఇవ్వడం లేదని రాజాసింగ్ చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..