- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SRH రిటైన్ చేసుకోదు.. కానీ, ఐపీఎల్‌లో పేరు నమోదు చేసుకుంటా : డేవిడ్ వార్నర్
<p>దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022 మెగా వేలానికి తన పేరు నమోదు చేసుకుంటానని సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్సీని పోగొట్టుకోవడమే కాకుండా జట్టులో చోటు కోల్పోయి హోటల్ రూమ్‌కే పరిమితం అయ్యాడు. వచ్చే సీజన్‌లో SRH డేవిడ్ వార్నర్‌ను రిటైన్ చేసుకునే అవకాశం లేదు. ఈ విషయంపై తాజాగా వార్నర్ ఒక రేడియో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘హైదరాబాద్ జట్టు తనను రిటైన్ […]</p>

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022 మెగా వేలానికి తన పేరు నమోదు చేసుకుంటానని సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్సీని పోగొట్టుకోవడమే కాకుండా జట్టులో చోటు కోల్పోయి హోటల్ రూమ్‌కే పరిమితం అయ్యాడు. వచ్చే సీజన్‌లో SRH డేవిడ్ వార్నర్‌ను రిటైన్ చేసుకునే అవకాశం లేదు. ఈ విషయంపై తాజాగా వార్నర్ ఒక రేడియో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘హైదరాబాద్ జట్టు తనను రిటైన్ చేసుకోదు అనే విషయం నాకు అర్ధం అయ్యింది. ఇది జీర్ణించుకోవడానికి కాస్త కష్టంగానే ఉన్నది. కానీ నేను మెగా ఆక్షన్ కోసం అందుబాటులో ఉంటాను. వచ్చే ఐపీఎల్ నుంచి కొత్తగా కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్నాను’ అని వార్నర్ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది వార్నర్‌ను తీసుకోవడానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో పాటు కొత్త ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Tags
- David Warner
- ipl






