తొగర్రాయిలో పోలీసుల కార్డన్ సెర్చ్.. భారీగా వాహనాలు సీజ్..

by  |
తొగర్రాయిలో పోలీసుల కార్డన్ సెర్చ్.. భారీగా వాహనాలు సీజ్..
X

దిశ, దుగ్గొండి: అసాంఘిక కార్యకలాపాల అణచివేత లక్ష్యంగా నర్సంపేట ఏసీపీ సిహెచ్.ఆర్.వి ఫణిదర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ.. అసాంఘిక చర్యల నివారణలో పోలీసు సిబ్బందితో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. మీ ప్రాంతంలో అసాంఘిక చర్యలు జరగకుండా ఉండాలంటే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం కోసం కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు.

సరైన అనుమతి పత్రాలు లేని 30 ద్వి చక్రవాహనాలు సీజ్ చేయడంతో పాటు అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సతీష్ బాబు, డివిజన్ లోని ఎస్సై లు నవీన్ కుమార్, వెంకటేశ్వర్లు, సాయిబాబు, సర్పంచ్ తిరుపతి రెడ్డి, తుమ్మలపెళ్లి మహేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.Next Story