- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కజొన్న పొట్టు నుంచి ఎకో ఫ్రెండ్లీ పెన్..
<p>దిశ, ఫీచర్స్ : కొందరు ప్రతీ విషయంలోనూ ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తుంటారు. ఇది ఇలా మాత్రమే ఎందుకుండాలి? అలా ఎందుకు ఉండకూడదు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ.. నూతన ఆవిష్కరణలకు కారకులు అవుతారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే వరంగల్ జిల్లా గోపాలపురంకు చెందిన 30 ఏళ్ల రాజు ముప్పారపు. ఇప్పటికే స్ట్రీట్ లైట్స్‌కు సెన్సార్, బ్యాటరీతో నడిచే సైకిల్ వంటి లో-కాస్ట్ ఇన్నోవేషన్స్‌కు కారకుడైన ఆయన.. తాజాగా మరో ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. మొక్కజొన్న పొట్టు నుంచి […]</p>

దిశ, ఫీచర్స్ : కొందరు ప్రతీ విషయంలోనూ ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తుంటారు. ఇది ఇలా మాత్రమే ఎందుకుండాలి? అలా ఎందుకు ఉండకూడదు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ.. నూతన ఆవిష్కరణలకు కారకులు అవుతారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే వరంగల్ జిల్లా గోపాలపురంకు చెందిన 30 ఏళ్ల రాజు ముప్పారపు. ఇప్పటికే స్ట్రీట్ లైట్స్‌కు సెన్సార్, బ్యాటరీతో నడిచే సైకిల్ వంటి లో-కాస్ట్ ఇన్నోవేషన్స్‌కు కారకుడైన ఆయన.. తాజాగా మరో ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. మొక్కజొన్న పొట్టు నుంచి పెన్నులు తయారు చేశాడు. ఏప్రిల్ 27న ఈ లేటెస్ట్ ఇన్నోవేషన్‌ను లాంచ్ చేశాడు ఈ యంగ్ ఇన్నోవేటర్.
తమ చుట్టుపక్కల గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు అధికంగా మొక్కజొన్న సాగుచేస్తారని తెలిపిన రాజు.. పంటను మార్కెట్‌కు తరలించే ముందు మిగిలిపోయిన పొట్టును కాల్చేస్తుంటారని చెప్పాడు. తద్వారా వాతావరణం కలుషితం అవుతుండటంతో.. దీనికి పరిష్కారం కనుగొనాలని అనుకున్నాడు. ఈ మేరకు పెన్ రీఫిల్స్ ఇన్సర్ట్ చేసేలా మొక్కజొన్న పొట్టును సిలిండ్రికల్ షేప్డ్ హోల్డర్స్‌లా మౌల్డ్ చేశాడు. దీని వల్ల పెన్నుల వల్ల కలిగే ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందని, కార్న్ హస్క్(మొక్కజొన్న పొట్టు)కాల్చే పనికూడా ఉండదని తద్వారా ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గుతుందని వివరించాడు.
రెండు వారాల క్రితం ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మొక్కజొన్న చేను నుంచి మొక్కజొన్న పొట్టు తీసుకువచ్చిన రాజు.. ఓ టేబుల్‌పై పరిచి కట్టింగ్ మెషిన్‌తో దీర్ఘచతురస్రాకారంలో ముక్కలుగా చేశాడు. ఓ మెటల్ రాడ్‌ను మెజరింగ్ టూల్‌గా యూజ్ చేస్తూ.. పొట్టును రోల్ చేశాడు. దాన్నుంచి రాడ్‌ను రిమూవ్ చేసి, రెండు ఓపెన్ ఎండ్స్‌తో సిలిండ్రికల్ షేప్ కలిగిన హస్క్ తయారు చేశాడు. దీనిలోకి రిఫిల్ ఇన్సర్ట్ చేసి ఒక ఎండ్ మూసివేసిన రాజు.. కరెక్ట్‌గా రిఫిల్ ఫిట్ అయ్యేలా చేసి మరో ఎండ్‌ను కూడా క్లో్జ్ చేశాడు. ఇదే విధంగా ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ పెన్ కోసం క్యాప్ కూడా తయారుచేశానని తెలిపిన రాజు.. ఫస్ట్ పెన్ మేకింగ్ పూర్తి కాగానే రాసి చూశానని, రెగ్యులర్ పెన్‌తో రాసిన ఫీలింగ్ వచ్చిందని చెప్పాడు. అలా ఒక్కో పెన్ను తయారీకి కేవలం పదినిమిషాలు పట్టిందని తెలిపాడు.
కొన్ని రోజుల తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ పమేల సత్పతిని కలిసి నేచురల్ ఫ్రెండ్లీ పెన్ మేకింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగా ఆమె ఇంప్రెస్ అయినట్లు చెప్పాడు. ఒకేసారి 1000 పెన్నులు ఆర్డర్ ఇచ్చారని, ప్రతీ పెన్నుకు రూ.10 రూపాయలు చార్జ్ చేస్తున్నానని తెలిపారు. ఈ ఇన్నోవేషన్‌కు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నుంచి కూడా రాజుకు ప్రశంసలు దక్కాయి. ఒకవేళ మీకు ఈ ఐడియా నచ్చి ఎకో ఫ్రెండ్లీ పెన్నులను ఆర్డర్ చేయాలనుకుంటే.. రాజు(9502855858) కాంటాక్ట్ చేయొచ్చు.






