సంచాల సప్పుళ్ల‌కు బ్రేక్ వేసిన కరోనా..

by Shyam |

<p>అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నవరంగల్ కొత్తవాడ జంపఖానాలకు ఆదరణ కరువైంది. మార్కెట్ లేక రూ.10 కోట్ల విలువైన ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయి. నేత కార్మికులు రోడ్డున పడ్డారు. కరోనా దెబ్బకు సాంచాల సప్పుళ్లు ఆగిపోయాయి. సర్కారు సైతం ఆర్డర్లు ఇవ్వడం లేదు. పాతబకాయిలు ఇవ్వక పోవడంతో సొసైటీలు కుదేలవుతున్నాయి. ఉత్పత్తులకు సర్కారు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి తమను ఆదుకోవాలని నేతన్నలు డిమాండ్ చేస్తున్నారు. దిశ, న్యూస్ బ్యూరో: వరంగల్ జంపఖానాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఎన్నోఅవార్డులు పొందిన చరిత్ర [&hellip;]</p>

సంచాల సప్పుళ్ల‌కు బ్రేక్ వేసిన కరోనా..
X

అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నవరంగల్ కొత్తవాడ జంపఖానాలకు ఆదరణ కరువైంది. మార్కెట్ లేక రూ.10 కోట్ల విలువైన ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయి. నేత కార్మికులు రోడ్డున పడ్డారు. కరోనా దెబ్బకు సాంచాల సప్పుళ్లు ఆగిపోయాయి. సర్కారు సైతం ఆర్డర్లు ఇవ్వడం లేదు. పాతబకాయిలు ఇవ్వక పోవడంతో సొసైటీలు కుదేలవుతున్నాయి. ఉత్పత్తులకు సర్కారు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి తమను ఆదుకోవాలని నేతన్నలు డిమాండ్ చేస్తున్నారు.

దిశ, న్యూస్ బ్యూరో: వరంగల్ జంపఖానాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఎన్నోఅవార్డులు పొందిన చరిత్ర ఉంది. మార్కెట్ లేకపోవడంతో నేడు రూ.10 కోట్ల విలువైన స్టాక్ పేరుకుపోయింది. దీంతో ఉపాధి కరువై నేతన్నలు రోడ్డున పడుతున్నారు. యోగా దినోత్సవాలకు ప్లాస్టిక్ తివాచీ కంటే వందశాతం కాటన్తో చేతితో నేసిన జంపఖానా వినియోగం వల్ల కలిగే లాభాన్ని, ఆరోగ్యాన్నిఅధికారికంగా ప్రచారం చేస్తే చాలు. వేలాది మంది కార్మికులకు రెండు పూటలా తిండి దొరుకుతుందని చేనేత వర్గాలు చెబుతున్నాయి. హాస్టల్స్కు పంపిణీ చేసే దుప్పట్ల ఆర్డర్లను సర్కారు నిలిపి వేసిందని వారు వాపోతున్నారు.

ఆర్డర్లు రావడం లేదు..

గడిచిన 8 నెలలుగా కొత్తవాడ ఉత్పత్తులను టెస్కో కొనుగోలు చేయడం లేదు. పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వడం లేదని, కార్మికులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని హాస్టల్స్​కు ఇక్కడి దుప్పట్లనే పంపిణీ చేసేవారు. ఇప్పుడు తెలంగాణ వరకైనా ఆర్డర్ రావడం లేదు. ఏపీ అధికారులతో మాట్లాడితే ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 4 నంబరు దుప్పట్ల నేతకు శ్రీకారం చుట్టాం. ఇప్పుడు వాటికి ప్రభుత్వం కూడా ఆర్డర్ ఇవ్వకపోవడం వల్ల 5 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని జాతీయ స్థాయి అవార్డు గ్రహీత ఉల్లాల మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 25 చేనేత సంఘాల దగ్గర దర్రీస్, దుప్పట్లు, జంపఖానాల నిల్వలు పేరుకుపోయాయన్నారు. మిత్తీలకు తెచ్చి నూలు కొనుగోలు చేసి, నేయిస్తే ఇప్పుడేమో అమ్ముడుపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.

సామాజిక మాధ్యమాలే బెటర్..

కొత్తవాడ నేతన్నలను సర్కారు పట్టించుకోవడం లేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో మా దగ్గరున్న స్టాక్ వివరాలను అప్లోడ్ చేశాం. దుబాయ్, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కొద్దిగా ఆర్డర్లు లభించాయి. డోర్ మ్యాట్లయితే ఎక్కువగా అమ్మేశాం. ప్రతి ఆదివారం మేమే కార్లు, ఆటోల్లో హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలకు తీసుకెళ్తున్నాం.

– చిప్పా వెంకటేశ్వర్లు, చేనేత సొసైటీ ప్రతినిధి

బ్యాగులకు వినియోగించొచ్చు..

కొత్తవాడ చేనేత ఉత్పత్తులను అనేక రకాలుగా ఉపయోగించొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉత్పత్తులపై విస్తృతంగా ప్రచారం చేయాలి. వాటిని స్కూలు, కాలేజీ బ్యాగుల తయారీకి మన్నికగా ఉంటాయని గుర్తించాం. ఆ దారిలోనూ ప్రచారం చేస్తున్నాం. హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు, జంపఖానాలను పంపిణీ మరింత పెంచాలి.

– యర్రమాద వెంకన్ననేత, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త

కొత్తవాడ దర్రీస్ కొందాం ..

కొత్తవాడ దర్రీస్ చాలా బాగుంటాయి. అన్నీచేనేత కార్మికులే నేశారు. 3 లక్షల వరకు స్టాక్ ఉంది. ప్లాస్టిక్ తివాచీల కంటే వందశాతం కాటన్​తో నేసిన ఈ దర్రీస్, జంపఖానాలు మేలు. యోగా మ్యాట్లుగానూ, ఇతర పనులకు వీటిని వాడుకోవచ్చు. ప్లాస్టిక్ను దూరం చేద్దాం. నేనూ కొన్నాను. ధర కూడా తక్కువే. అనేక రకాల డిజైన్లతో ఆకట్టుకున్నాయి.

– అనసూయ, ప్రముఖ యాంకర్

Next Story