కొత్తకొండ వీరభద్రస్వామివారి సేవలో సీపీ

36

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ సందర్శించారు. ఆదివారం ఉదయం దేవాలయానికి చేరుకున్న సీపీ ప్రమోద్ కుమార్‌ను ఆలయ అధికారులు, పుజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రమోద్ కుమార్‌కు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించబడే కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలపై సీపీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆలయ అధికారులు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.