చేతబడితో మాయం.. తిరిగొచ్చిన యువకుడు..!

89

దిశ, నర్సంపేట : గడచిన 24 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిన యువకుడి అదృశ్యం కేసు చిక్కుముడి వీడింది. చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చీమల సతీష్ (28) చేతబడి కారణంగా అదృశ్యం అయ్యాడని భయబ్రాంతులకు గురైన స్థానికులు ఆ యువకుడి ఆచూకీ లభ్యం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం అదృశ్యమైన చీమల సతీష్ (28) వరంగల్ బస్టాండ్ వద్ద శుక్రవారం తిరగాడుతూ కనపడ్డాడు. ఇది గమనించిన ఉప్పరపల్లికి గ్రామానికి చెందిన వారు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సతిష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉన్నపలంగా చెప్పాపెట్టకుండా అదృశ్యమైన వ్యక్తి తిరిగి రావడంతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా అసలు రాత్రి పడుకున్న వ్యక్తి అదృశ్యమవడం, పైగా మంచం పక్కనే మనిషి బొమ్మ ముగ్గు గీయడం, కుంకుమ, నిమ్మకాయల తో భయబ్రాంతులకు గురిచేసేలా చేసిన ఏర్పాట్లు ఎవరు చేశారు, సతీష్ ని తీసుకెళ్లిందేవరు.. రాత్రంతా సతీష్ ఎక్కడ ఉన్నాడన్న పూర్తి విషయాలు విచారణలో తేలనున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..