- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో ‘కొవిడ్-19 వార్ రూం’
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: కరోనాపై పోరును 24 గంటలూ పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు చేసేలా ‘కొవిడ్ 19 వార్ రూం’ను ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది. ఢిల్లీ సెక్రెటేరియట్‌లో ఏర్పాటు చేయనున్న ఈ వార్ రూంలో సుమారు 25 మంది నిపుణులు విధులు నిర్వహిస్తారు. టెస్టింగ్, అందుబాటులోని పడకలు, వైద్య పరికరాలు, అంబులెన్స్ సౌకర్యం, కంటైన్‌మెంట్ జోన్‌లను ఈ వార్ రూం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత పరిస్థితులే కాదు, భవిష్యత్తు అవసరాలను గుర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ఏరియాలో […]</p>

X
న్యూఢిల్లీ: కరోనాపై పోరును 24 గంటలూ పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు చేసేలా ‘కొవిడ్ 19 వార్ రూం’ను ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది. ఢిల్లీ సెక్రెటేరియట్‌లో ఏర్పాటు చేయనున్న ఈ వార్ రూంలో సుమారు 25 మంది నిపుణులు విధులు నిర్వహిస్తారు. టెస్టింగ్, అందుబాటులోని పడకలు, వైద్య పరికరాలు, అంబులెన్స్ సౌకర్యం, కంటైన్‌మెంట్ జోన్‌లను ఈ వార్ రూం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత పరిస్థితులే కాదు, భవిష్యత్తు అవసరాలను గుర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ఏరియాలో సరిపడా అంబులెన్స్‌లు లేకుంటే ఆ సమస్యను అధికారుల ముందుకు తెస్తుంది. కాగా, వార్ రూం ఇన్‌చార్జీగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. ఈయన వార్ రూం అవసరాలు, సూచనలకు, రాష్ట్ర ఉన్నతాధికారులను అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు.
Next Story






