మెగా ఫ్యామిలీ, నానికి మధ్య వార్.. సీన్‌లోకి అల్లు అరవింద్.. ఏం జరిగింది?

by  |
ghani
X

దిశ, సినిమా : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. భారీ అంచనాల నడుమ వస్తున్న సినిమాలో వరుణ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. కాగా ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. వరుస మూవీస్ రిలీజ్, మార్కెటింగ్ సమస్యల వల్ల డిసెంబర్ 2న డేట్ ఫిక్స్ చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలో బాలయ్య ‘అఖండ’ రావడంతో ‘గని’ రిలీజ్ పోస్ట్‌పోన్ చేసి డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇదే రోజు నేచురల్ స్టార్ నాని పిరియాడిక్ థ్రిల్లర్ ‘శ్యామ్ సింగరాయ్’ కూడా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. ఈ మూవీ టీజర్‌కే బ్లాక్ బస్టర్ మార్కులు పడగా.. రెండూ ఒకేసారి రిలీజ్ అయితే ‘గని’ ఫలితాలు ఎలా ఉంటాయనేది చెప్పలేం.

దీంతో నాని, వరుణ్ మధ్య పోరు తప్పదంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాలకు ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’రిలీజ్ కావటం, ఆ తర్వాత దగ్గరలోనే ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఉండటం.. పైగా ‘గని’ మూవీని అల్లు అరవింద్ తనయుడు బాబీ నిర్మించడంతో.. ‘శ్యామ్ సింగరాయ్’ను సంక్రాంతి తరువాత విడుదల చేసుకోవాలని అల్లు అరవింద్ సలహాలిస్తున్నట్లు టాక్. వాస్తవానికి ఇలాంటి సలహా మరో వ్యక్తి ఇస్తే నాని పెద్దగా పట్టించుకునేవాడు కాదేమో. కానీ ఇక్కడ అల్లు అరవింద్ కాబట్టి ఈ విషయాన్ని ఏవిధంగా డీల్ చేయాలో తెలియక నాని మదనపడుతున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed