టాలీవుడ్‌లో ఫ్యాన్ వార్.. కొట్టుకుంటున్న మహేష్ బాబు, బన్నీ ఫ్యాన్స్..

by  |
టాలీవుడ్‌లో ఫ్యాన్ వార్.. కొట్టుకుంటున్న మహేష్ బాబు, బన్నీ ఫ్యాన్స్..
X

దిశ, సినిమా : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ లేదు అనుకున్నా.. లోలోపల జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ట్విట్టర్ వేదికగా కొట్టుకుంటున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురంలో’ చిత్రాల విడుదల సమయం నుంచి రాజుకున్న వివాదం ఇప్పుటికీ కొనసాగుతూనే ఉంది. అటు ప్రిన్స్, ఇటు బన్నీ ఏ ఒక్కరు కూడా సినిమా రిలీజ్‌పై వెనక్కి తగ్గకపోవడంతో మొదలైన గొడవ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కంటిన్యూ అవుతోంది.

మహాశివరాత్రి సందర్భంగా మహేష్ బాబు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయగా.. సినిమా అప్‌డేట్ ఇవ్వకపోతే వీడు చచ్చిపోతను అన్నా అంటూ అల్లు అర్జున్ ఫొటో యాడ్ చేస్తూ రిప్లై ఇచ్చాడు ఓ ఫ్యాన్. దీన్ని కంటిన్యూ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ కొందరు బన్నీని కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో తమ హీరోను కించపరిచారంటూ బన్నీ ఫ్యాన్స్ హార్ట్ అయి… డ్రగ్స్ క్వీన్ మహేష్ బాబు(#DrugsQueenMaheshbabu)ట్రెండ్‌కు తెరలేపారు.

అసభ్యపదజాలం, మీమ్స్‌తో ట్వీట్స్, రీట్వీట్స్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. అల్లు అర్జున్ అభిమానుల ట్రెండింగ్‌తో మండిపడిన మహేష్ ఫ్యాన్స్.. క్యారెక్టర్ లెస్ హీరోయిన్ అల్లు అర్జున్(#CharacterLessHeroineAlluArjun) హాష్ ట్యాగ్‌తో మరో ట్రెండ్‌కు తెరలేపారు. మొత్తానికి ఇరువురి అభిమానులు టాలీవుడ్‌లో ఫ్యాన్ వార్ జరుగుతుందనే సంకేతం ఇవ్వగా.. నేషనల్ లెవల్‌లో చర్చ జరుగుతోంది.


Next Story

Most Viewed