- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాదంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గండ్ర.. ఆడియో లీక్ వైరల్
<p>దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. గండ్ర వెంకటరమణా రెడ్డి, ఎఫ్ బి ఎఫ్ నాయకులు గండ్ర సత్య నారాయణరావు అనుచరుల మధ్య వార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శాసన సభ్యుల అనుచరుడు ఒకరు సత్తన్న అనుచరులను రోకలి బండలు ఎక్కిస్తానంటూ చేసిన బెదిరింపులపై తీవ్ర చర్చ జరుగుతుంది. అనవసరమైన పోస్టులు పెడితే ఊరుకునేది లేదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సత్తెన కాంగ్రెస్‌లోకి రావడం ఖాయమైన […]</p>

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. గండ్ర వెంకటరమణా రెడ్డి, ఎఫ్ బి ఎఫ్ నాయకులు గండ్ర సత్య నారాయణరావు అనుచరుల మధ్య వార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శాసన సభ్యుల అనుచరుడు ఒకరు సత్తన్న అనుచరులను రోకలి బండలు ఎక్కిస్తానంటూ చేసిన బెదిరింపులపై తీవ్ర చర్చ జరుగుతుంది. అనవసరమైన పోస్టులు పెడితే ఊరుకునేది లేదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సత్తెన కాంగ్రెస్‌లోకి రావడం ఖాయమైన సందర్భంగా.. శాసనసభ్యుల అనుచరులు సత్తన్న అనుచరులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఈ మధ్య సత్తన్న ఎమ్మెల్యేపై అంగన్వాడీల నియామకాల్లో అవకతవకలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో చెలరేగిన ఎమ్మెల్యే అనుచరులు ఫోన్ కాల్‌లో బెదిరింపులకు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో పలు పోస్టింగ్‌లు పెట్టిన వారిపై వెంకట రమణ రెడ్డి అనుచరులు తీవ్రంగా మండిపడుతూ.. హెచ్చరికలు చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చలు, వార్నింగ్ లు సోషల్ మీడియాలో రావడంతో ఇవి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అనుచరుల తీరు ఎమ్మెల్యేను వివాదంలోకి తీసుకొచ్చేలా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.






