- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పినపాకలో భయం.. భయం.. పులి కోసం అధికారుల జల్లెడ
by Sridhar Babu |
<p>దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పరిధి అటవీప్రాంతంలో పులి భయం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. అమరారం అటవీ ప్రాంతంలోని జూదాల చెరువు వద్ద పులి ఓ ఆవు దూడను చంపేసిన సంగతి తెలిసిందే. ఈ దాడితో ఫారెస్ట్ అధికారులు పులి జాడకోసం ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో బుధవారం మండలంలోని గోపాలరావుపేట, బాపనకుంట చెరువు వెనుక పులిని చూశామని కొంతమంది వ్యక్తులు […]</p>

X
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పరిధి అటవీప్రాంతంలో పులి భయం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. అమరారం అటవీ ప్రాంతంలోని జూదాల చెరువు వద్ద పులి ఓ ఆవు దూడను చంపేసిన సంగతి తెలిసిందే. ఈ దాడితో ఫారెస్ట్ అధికారులు పులి జాడకోసం ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో బుధవారం మండలంలోని గోపాలరావుపేట, బాపనకుంట చెరువు వెనుక పులిని చూశామని కొంతమంది వ్యక్తులు తెలిపారు. వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఫారెస్ట్ అధికారులు గోపాలరావు పేట ప్రాంతానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో బాపనకుంట చెరువు దగ్గర పులి పాదాలను అధికారులు గుర్తించారు. గ్రామ ప్రజలను అప్రమత్తం చేసి గోపాలరావుపేట అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
- Tags
- forest
Next Story






