- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. దాడిలో VRA మృతి
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో సోమవారం రాత్రి మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తుండగా వీఆర్ఏ గౌతమ్ అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా వీఆర్ఏను చితకబాదారు. దాడిలో తీవ్రంగా గాయపడిన గౌతమ్.. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. దీంతో బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట గౌతమ్ కుటుంబ సభ్యులు, వీఆర్ఏ సంఘం నాయకులు […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో సోమవారం రాత్రి మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తుండగా వీఆర్ఏ గౌతమ్ అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా వీఆర్ఏను చితకబాదారు. దాడిలో తీవ్రంగా గాయపడిన గౌతమ్.. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు.
దీంతో బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట గౌతమ్ కుటుంబ సభ్యులు, వీఆర్ఏ సంఘం నాయకులు నిరసనకు దిగారు. ఇదిలా ఉండగా ఇసుక మాఫియాకు అధికార పార్టీ అండ ఉండటంతోనే జోరుగా అక్రమ రవాణా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
- Tags
- dead
Next Story






