జోరుగా హుషారుగా పెన్షన్ల పంపణీ

by  |
జోరుగా హుషారుగా పెన్షన్ల పంపణీ
X

ఏపీలో వలంటీర్లు జోరుగా హుషారుగా పెన్షన్లు పంచుతున్నారు. మే నెలకు సంబంధించిన పెన్షన్లను గ్రామ, వార్డు వలంటీర్లు ఉదయం ఐదు గంటల నుంచే ఇంటింటికీ తిరిగి అందజేస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా పెన్షన్ దారుల బయో మెట్రిక్ స్థానంలో ఫొటోల జియో ట్యాగింగ్ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే ఉదయం 9 గంటల వరకు 38.53 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు.

మిగిలిన 19.69 మందికి రేపు ఉదయం అందజేయనున్నారు. కాగా, ఏపీలో మొత్తం 58.22 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ నెలకి 1,421.20 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. అయితే వారికి పెన్షన్లే జీవనాధారం కావడంతో…ఎలాంటి ఆటంకం కలుగకుండా ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్లు అందజేస్తోంది. పెన్షన్ ఇచ్చే సమయంలో వారి యోగక్షేమాలను వలంటీర్లు అడిగి తెలుసుకుంటున్నారు.

Tags: ap, pension, village, volunteers


Next Story

Most Viewed